calender_icon.png 24 October, 2024 | 7:51 AM

అంకిత, అడ్రిన్‌కు ఒలింపిక్స్ బెర్త్

08-07-2024 02:21:37 AM

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల సంఖ్య 30కి చేరింది. ఇప్పటికే 28 మంది అథ్లెట్లు పారిస్ బెర్తు దక్కించుకోగా.. తాజాగా ర్యాంకింగ్స్ ఆధారంగా మరో ఇద్దరు అథ్లెట్లు విశ్వక్రీడలకు అర్హత సాధించారు. పురుషుల లాంగ్ జంప్‌లో జెస్విన్ అడ్రిన్, మహిళల 5000 మీటర్ల పరుగులో అంకిత దయాని ఆదివారం ఒలింపిక్స్‌లో అర్హత సాధించారు. ఈ మేరకు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య వివరాలు వెల్లడించింది. భారత టాప్ లాంగ్ జంపర్ శ్రీశంకర్ నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా.. గాయం కారణంగా అతడు దూరం కాగా.. జాతీయ రికార్డుధారి అడ్రిన్‌కు తాజాగా అవకాశం దక్కింది.

ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అడ్రిన్ 31వ స్థానంలో ఉండగా.. టాప్ పారిస్ బరిలో దిగనున్నారు. మరోవైపు అంకిత నిరుడు ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గింది. ఈ విభాగంలో ఇప్పటికే భారత్ నుంచి పారుల్ చౌదరి ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా.. ఇప్పుడు అంకిత కూడా పారుల్ సరసన చేరింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల బృందానికి స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నాయకత్వం వహించనున్నాడు.