10వేల మీటర్ల మారథాన్
పారిస్: ఒలింపిక్స్‌లో 10వేల మీటర్ల మారథాన్ రేసుకు చాలా క్రేజ్ ఉంటుంది. ఈ రేసులో పాల్గొనే అథ్లెట్ శారీరకంగా, మానసికంగా చాలా ఫిట్‌గా ఉండాల్సి వస్తోంది. తాజాగా శనివారం పురుషుల 10 వేల మీటర్ల మారథాన్ ఫైనల్ రేసు జరిగింది. ఎథియోపియాన్ అథ్లెట్ టమిరట్ టోలా విజేతగా నిలిచి స్వర్ణం చేజెక్కించుకున్నాడు. 10వేల మీటర్ల మారథాన్‌ను టోలా 2 గంటల 6 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసి ఒలింపిక్ రికార్డు నెలకొల్పాడు.
ఇక బెల్జియం అథ్లెట్ బషీర్ అబ్ది (2 గంటల 6 నిమిషాల 47 సెకన్లు), కెన్యా అథ్లెట్ బెన్సన్ కిప్రుటో (2 గంటల 7 నిమిషాలు) వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. గతానికి భిన్నంగా ఈసారి కెన్యా అథ్లెట్ కాకుండా వేరే అథ్లెట్ పసిడి నెగ్గడం విశేషం. ఇక మహిళల 10వేల మీటర్ల మారథాన్ రేసులో కెన్యా అథ్లెట్ బియాట్రిస్ చెబెట్ స్వర్ణం కైవసం చేసుకోగా.. బాట్కోలెట్టీ (ఇటలీ), హస్సన్ (నెదర్లాండ్స్) రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.