స్టార్ స్విమ్మర్ కన్నీటి పర్యంతం
న్యూయార్క్: లాస్ ఏంజెలెస్‌లో అంటుకున్న కార్చిచ్చు అమెరికాను కుదిపేస్తోంది. ప్రకృతి వైపరిత్యానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. అమెరికన్ మాజీ స్విమ్మర్ గ్యారీ హాల్ జూనియర్ కార్చిర్చు బారిన పడ్డాడు. ఒలింపిక్స్‌లో సాధించిన 10 పతకాలు బుగ్గిపాలు అయ్యాయి.
ఒలింపిక్స్ పత కాలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాధించిన ఆరు పతకాలు కూడా అగ్నికీలల్లో దహనమయ్యాయి. ‘నా జీవితంలోనే ఇది అత్యంత దారుణమైన ఘటన. లాస్ ఏంజెలెస్ నగరాన్ని మంటలు చుట్టుముట్టేశాయి. ఎంతో కష్టపడి సాధించిన ఒలింపిక్ పతకాలు, ప్రపంచ చాంపియన్ కిరీటాలు ఒక్కొక్కటిగా నా కళ్ల ముందే కరిగిపోయాయి.
నా పెం పుడు కుక్కతో పాటు కొన్ని వస్తువులను తీసుకొని కారులో అక్కడి నుంచి వెళ్లిపోయా. ఇళ్లు ఉండే చోటుకు మళ్లీ వెళ్లినప్పుడు బూడిదలో వెతికి పతకాలు కరిగిపోయాయేమో చూడాలి. కనీసం ఒక్కటైనా కరిగిపోకుండా ఉంటుందనే ఆశతో ఉన్నా’ అని గ్యారీ హాల్ కన్నీటీపర్యంతమయ్యాడు.
2000 సిడ్నీ, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో 50 మీ ఫ్రీ స్టుల్ విభాగాల్లో గ్యారీ హాల్ వరుసగా స్వర్ణ పతకాలు సాదించాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో రిలే ఈవెంట్‌లో మూడు స్వర్ణాలు సాధించిన గ్యారీ మరో మూడు రజతాలు, రెండు కాంస్యాలు కూడా అందుకున్నాడు.