భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు, కమిటీ అధ్యక్షులు, గురువారం కలెక్టర్ ను మర్యాదపూరితంగా కలిశారు. అనంతరం జిల్లాలోని క్రీడాకారులకు మౌలిక సదుపాయం కోసం వివరించారు. కొత్తగూడెం, మున్సిపాలిటీ గ్రౌండ్ నందు సింథటిక్ ట్రాక్ కొరకై జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సానుకూలంగా స్పందించి అధికారులను వేగవంతం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ కొత్తగూడెం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ రాసపల్లి రాజేంద్రప్రసాద్, కోశాధికారి కాసిం, వైస్ ప్రెసిడెంట్ వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.