calender_icon.png 26 October, 2024 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నికరలాభం 156% అప్

23-10-2024 12:00:00 AM

హైదరాబాద్, అక్టోబర్ 22: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన  క్యూ2లో 156 శాతం వృద్ధిచెంది రూ. 47.7 కోట్లకు చేరింది.  నిరుడు ఇదేకాలం లో కంపెనీ రూ. 18.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీ కార్యకలా పాల ఆదాయం 70.5 శాతం పెరిగి రూ. 307 కోట్ల నుంచి రూ. 523 కోట్లకు చేరింది.

ఇబిటా దాదాపు రెట్టింపై   రూ. 81.2 కోట్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్లు 13.2 శాతం నుంచి 15.5 శాతానికి మెరుగుపడ్డాయి. ఫలితాల విడుదల సందర్భం గా ఒలెక్ట్రా సిఎండీ  కెవీ  ప్రదీప్ మాట్లాడుతూ తమ  ఆర్డర్ బుక్ పటిష్ఠంగా ఉన్నదని చెప్పారు. ఉత్పత్తిని పెంపు,  సాంకేతిక సామర్థ్యాల మెరుగుదలపై తమ దృష్టి కొనసా గుతుందన్నారు.