calender_icon.png 25 January, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీ ఢీకొని వృద్ధురాలి మృతి

24-01-2025 07:17:59 PM

మందమర్రి (విజయక్రాంతి): లారీ ఢీకొన్న ఘటనలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని సింగరేణి జిఎం కార్యాలయం సమీపంలోని ఇల్లందు క్లబ్ ముందు నుండి జాతీయ రహదారి దాటుతుండగా మట్టిలోడుతో వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో పిల్లలమర్రి లలిత (58) అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. మృతురాలి కుమారుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.