calender_icon.png 16 March, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత గోడలే.. కొత్తగా..

16-03-2025 12:18:47 AM

ప్రస్తత కాలంలో తమ ఇల్లు అందరికంటే భిన్నంగా, అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. దానికి తగ్గట్లే మార్కెట్లో ప్రస్తుతం అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఒకటి లిక్విడ్ వాల్ పేపర్లు, సిల్క్, కాటన్ పదార్థాలతో తయారుచేసే వాల్‌పేపర్లు. మామూలుగా వాల్ పేపర్లు విడివిడిగా దొరుకుతాయి. దాన్ని నీళ్లతో కలిపి ముద్దలా చేసి ఆ తర్వాత కావాల్సిన చోట అతికిస్తారు.

అంతే.. గోడకు అదనపు అందాన్ని తీసుకొస్తూ ఈ వాల్‌పేపర్ ఇంటీరియల్‌లో భాగమైపోతుంది. లివింగ్ రూమ్, కిచెన్, బెడ్‌రూమ్.. ఇలా ఇంట్లోని గదులన్నింటిలో ఎంచుకున్న థీమ్‌కు నప్పేలా ఈ లిక్విడ్ వాల్‌పేపర్లనూ పెట్టుకోవచ్చు. ఆకట్టుకునే రంగులతో కనిపించడమే కాదు.. తాకితే మెత్తటి నునుపుదనంతో గోడలకు సరికొత్త లుక్కునూ తీసుకొస్తాయి.

అంతేకాదు.. నచ్చిన ఆకారాల్లో వీటిని ఉంచుతూ గగదికి ముచ్చటైన డెకరేషన్ చేయొచ్చు. వీటిలో లాభాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ వాల్‌పేపర్లపైన నీళ్లు పడినా కాసేపటికి వాటంతటవే ఆరిపోతాయి. ఎక్కడైనా కాస్త చిరిగినా మరక పడినా పాడైన చోటు వరకే మళ్లీ సరిచేయొచ్చు. కాస్త ఓపిక ఉంటే మనమే వీటిని స్వయంగా గోడలకు వేసుకోవచ్చు.