దిష్టి తగలకుండా ఉండటానికి మన పెద్దలు పాత సంప్రదాయ పద్ధతులను పాటిస్తారు. పిల్లల మెడలో నల్లతాడు కట్టడం, నల్లబొట్టు పెట్టడం లాంటివి ప్రధానంగా ఫాలో అవుతారు. కానీ ఇప్పుడు ఈవిల్ ఐ లాంటివి ట్రెండ్‌లో ఉన్నాయి. బ్లూ కలర్ ఈవిల్ ఐ ప్రధానంగా చెడు దృష్టి ప్రభావం తగ్గించడానికి వాడుతున్నారు. ప్రతి కలర్ ప్రత్యేకతను సూచిస్తుంది. దిష్టి నివారణకు ట్రెండింగ్ ఈవిల్ ఐని వాడుతున్నారు. దిష్టి నివారణకు కాళ్లకు నల్లతాడు కడుతుంటారు. ఇలాంటి ఆచారాలను ఇప్పటికీ చాలామంది పాటిస్తున్నారు.
ప్రస్తుతం ‘ఈవిల్ ఐ’ అనే వస్తువు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ట్రెండ్‌లో ఉంది. ఈ ఈవిల్ ఐను ప్రధానంగా బ్లూ కలర్ గాజుతో తయారు చేస్తారు. ఇది రౌండ్‌గా కనుపాపలాగా ఉంటుంది. దీన్ని మెడలో లాకెట్ లాగా కూడా ధరించడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది.
చెడు దృష్టి తగలడం వల్ల అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు వంటి ఇబ్బందులు ఎదురవుతాయని చాలామంది నమ్ముతారు. అలాంటి ప్రభావాల నుంచి బయటపడేందుకు బ్లూ కలర్ ఈవిల్ ఐను ధరిస్తున్నారు యువతులు. ఈవిల్ ఐ సాధారణంగా బ్లూ కలర్‌లో కనపడుతున్నది. కానీ ఇప్పుడు వేరే కలర్స్‌లో కూడా లభిస్తున్నాయి. ఒక్కో కలర్‌కి ఒక్కో ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఈవిల్ ఐ దిష్టి నివారణకు ఒక ఇంపార్టెంట్ సొల్యూషన్‌గా మారింది.