- బీఆర్‌ఎస్ హయాంలో ‘మనఊరు-మనబడి’
- రూ.4 కోట్ల పనులు చేసిన కాంట్రాక్టర్లు
- ఇప్పటికీ పెండింగ్‌లోనే బిల్లులు
- కొత్త సర్కార్‌లో చేసిన పనులకు రూ.11 కోట్ల చెల్లింపు-
సిరిసిల్ల, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో పలు అభివృద్ధి పను లు చేసినా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు రోడ్డున పడ్డారు. గత ప్రభుత్వ హయాం లో పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఒత్తిడి తేవడంతో కాంట్రాక్టర్లు అప్పులు చేసి మరి పనులు చేశారు.
తీరా పనులు పూర్తి చేసి, బిల్లుల కోసం అధికారుల వద్దకు వెళ్లగా చేతులేత్తాశారు. దీంతో లక్షల్లో అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారిం ది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టింఇ.
పనులకు టెండర్లు పిలిచి, నిధులు కేటాయించింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు యుద్ధప్రాతిపదికన పను లు చేపట్టారు. కొన్ని పాఠశాలల్లో పనులు అ సంపూర్తిగా ఉన్నప్పటికీ, కొన్ని పాఠశాలల్లో పనులు పూర్తి చేశారు.
కాగా బిల్లుల చెల్లింపు లో అధికారులు మీన మేషాలు లెక్కించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు రూ.4 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
కాంగ్రెస్ అమ్మ ఆదర్శ కమిటీలు
బడుల బలోపేతం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ 2024న ‘అమ్మ ఆదర్శ కమిటీ’ పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కమిటీల ద్వారా జిల్లాలోని 283 ప్రభుత్వ పాఠశాలలను మొదటి విడతలో ఎంపిక చేసింది. అభివృద్ధి పనులు చేసేందుకు నిధులు కేటాయించి, టెండర్లు పిలిచింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేశారు.
210 పాఠశాలల్లో పనులు పూర్తి చేయడంతో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.11 కోట్ల 80 లక్షల బిల్లులు చెల్లించింది. మిగితా పాఠశాల బిల్లుల చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదను లు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గత ప్రభుత్వం పాలనలో పాఠశాలల్లో చేసిన పనులకు బిల్లులు రాకపోవ డంతో కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇప్పటికే పనులకు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత పనులు పాతర పెట్టి, కొత్త పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పాత పనులు అసంపూర్తిగా వదిలిపెట్టి, కొత్త పనులు చేయడం పై సరికాదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్త పనులు సైతం గతంలో చేసిన వారికి పనులు అప్పగిస్తే, వారికి అప్పగించి, బిల్లులు చెల్లిస్తే, ఆర్థికంగా నష్టపోకుండా ఉండేవాళ్లమని కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బిలుల్లు రాకపోతే చావే శరణ్యం
పాఠశాలల్లో పనులు చేపట్టి ఏడాది అవుతుంది. బిల్లులు రావడం లేదు. ప్రభుత్వం మారడంతో బిల్లులు అందక, పనుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం. బిల్లులు ఇవ్వాలని అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకోవడంలేదు. రూ.19 లక్షల పనులు చేయగా కేవలం రూ.2.80 లక్షల బిల్లులు మాత్రమే ఇచ్చిర్రు. ఇంకా రూ.16.20 లక్షల బిల్లులు రావాల్సింది. బిల్లులు మంజూరు చేయడంలో అల స్యం చేస్తే తమకు ఆత్మహత్యే శరణ్యం.
ప్రభాకర్, కాంట్రాక్టర్,
బావుసాయిపేట