calender_icon.png 5 January, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాయుతిలో ముసలం?

03-01-2025 01:44:26 AM

  • బాబాయి శరద్ పవార్, అబ్బాయి అజిత్ పవార్ 
  • మళ్లీ చేతులు కలుపుతారా ?

  • ముంబై, జనవరి 2: మహారాష్ట్రలో ‘మహాయుతి’ పాలనా పగ్గాలు చేపట్టి నెల రోజులైనా పూర్తికాలేదు. అప్పుడే.. కూటమిలో లుకలుకలు మొదలయ్యయానే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మళ్లీ చేతులు కలుపుతారనే చర్చ జరుగుతోంది.

  • దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. డిసెంబర్ 12న శరద్ పవార్ పుట్టిన రోజు సందర్భంగా, ఆయన ఇంటికి వెళ్లి మరీ అజిత్ పవార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలోనే ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తున్నది. ఇక అజిత్ పవార్ మహాయుతి కూటమి నుంచి బయటకు వచ్చి, శరద్ పవార్‌తో జట్టు కడతారని వదంతులు వినిపిస్తున్నాయి.

కీలకంగా ఇద్దరి వ్యాఖ్యలు..

అజిత్ పవార్ తల్లి ఆశాతై మీడియాతో మాట్లాడుతూ..  ‘పవార్ కుటుంబంలో విభేదాలు తొలగిపోయి, అజిత్ పవార్ తన బాబాయి శరద్ పవార్‌తో కలిసి ముందుకు నడవాలి’ అని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. ‘ఎన్సీపీ నుంచి విడిపోయినప్పటికీ శరద్ పవార్‌పై మా పార్టీకి అమితమైన గౌరవం ఉంది.  శరద్ పవార్ మాకు తండ్రితో సమానం. పవార్ కుటుంబం మళ్లీ కలవాలని మేం కోరుకుంటున్నాం’ అని వెల్లడించారు. వీరిద్దరి వ్యాఖ్యలు పవార్లు మళ్లీ కలుస్తారనే సంకేతాలు ఇస్తున్నట్లు ఉండడంతో సర్వత్రా చర్చోపచర్చలు సాగుతున్నాయి.