calender_icon.png 27 December, 2024 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యం.!

02-11-2024 11:08:14 AM

ఆలస్యంగా గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: ఓ మైనర్ బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. డీఎస్పీ బుర్రీ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన (10 )ఏళ్ల బాలిక అక్టోబర్ 30న ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటుండగా  అదే గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మల్లయ్య (65) అనే వృద్ధుడు ఇంట్లోకి పిలిచి మభ్యపెట్టి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా గుర్తించిన సదరు బాలిక తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి తిమ్మాజిపేట్ పోలీసులకు ఫిర్యాదు  చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.