calender_icon.png 12 October, 2024 | 1:57 AM

చిన్న మొత్తాలపై పాతవడ్డీ రేట్లే..

01-10-2024 12:00:00 AM

యథాతథంగా కొనసాగించిన కేంద్రం

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం మరోసారి యథాత థంగా ఉంచింది. అక్టోబర్ --డిసెంబర్ త్రైమాసికానికి పాత వడ్డీ రేట్లే కొనసాగనున్నాయి. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి పథకాలపై వడ్డీ రేట్లను సవరించకపోవడం వరుసగా ఇది మూడోసారి.

జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో కొనసాగిన వడ్డీ రేట్లే మూడో త్రైమా సికంలోనూ కొనసాగుతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. సుకన్య సమృద్ధి యోజన పథకంపై ఎప్పటిలానే 8.2 శాతం వడ్డీ లభించనుంది. మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది.

పబ్లిక్ ప్రావి డెండ్ ఫండ్ పథకానికి7.1 శాతం, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్‌పై 4 శాతం వడ్డీ లభిస్తుంది. కిసాన్ వికాస్ పత్ర పథకంపై 7.5 శాతం లభిస్తుంది. . నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై7.7 శాతం, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ 7.4 శాతం చొప్పున వడ్డీ లభిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.