calender_icon.png 5 April, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత నేరస్తుడు అరెస్టు

05-04-2025 12:31:41 AM

ఎల్బీనగర్: అటెన్షన్ డైవర్షన్ చేసి దొంగతనం చేస్తున్న పాత నేరస్తుడ్ని చైతన్యపురి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. బండ్లగూడలోని మహమ్మద్ నగర్ కు చెందిన మీర్జా ఆజమ్ బేగ్ (38) బాధితులను అటెన్షన్ అండ్ డైవర్షన్ పద్ధతిలో మోసం చేసి, చోరీ చేయడంలో సిద్ధహస్తుడు. ఈ నెల 1వ తేదీన నేరెళ్ల వెంకట లక్ష్మీ నారాయణ బొలెరో వాహనంలో వనస్థలిపురం నుంచి ఉప్పల్ వైపు వెళ్తున్నాడు. మార్గంలో నాగోల్ ఫ్లై ఓవర్ వద్ద మీర్జా ఆజమ్ బేగ్ అడ్డగించి, నా డబ్బులు ఎందుకు తీసుకున్నారు అంటూ దాబయిస్తూ వెంకట లక్ష్మీ నారాయణ దగ్గర ఉన్న రూ. 8500 నగదును చోరీ చేశాడు. దీనిపై బాధితుడు వెంకట లక్ష్మీనారాయణ చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు క్రైమ్ సిబ్బంది సీసీ ఫుటేజ్ ఆధారంగా నేరస్తుడ్ని ట్రెస్ అవుట్ చేసి బండ్లగూడ వద్ద అరెస్టు చేశారు. నిందితుడ్ని విచారించగా 11 పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ చోరీ కేసుల్లో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసు నమోదు చేసి, రిమాండ్ తరలించినట్లు డిటెక్టివ్ ఇన్స్ స్పెక్టర్ గురుస్వామి తెలిపారు.