14-03-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (విజయక్రాంతి): బీజేపీ నుంచి పాత సామాను వెళ్లిపోవాలని, అప్పుడే పార్టీ బాగుపడుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలే లక్ష్యంగా ఓ వీడియోను విడుదల చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ సీఎంతో పలువురు నేతలు రహస్యంగా సమావేశమవుతున్నారని ఆరోపిం చారు.
ఇది పార్టీకి మంచిది కాదన్నారు. కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్న వారి వివరాలు తనకు తెలుసునని, ఈ విషయంపై త్వరలోనే బీజేపీ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది. మరోవైపు హోళీని మధ్యాహ్నం 12 గంటల వరకే జరుపుకోవాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో తమ పండుగలు ఎలా జరుపుకోవాలో సీఎం రేవంత్‌రెడ్డి చెబుతారా అని ప్రశ్నించారు.