న్యూఢిల్లీ, నవంబర్ 22: ద్విచక్రవాహన తయారీ కంపెనీ ‘ఓలా’ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికి ఇంటికి సాగనంపింది. కంపెనీ పునః వ్యవస్థీకరణలో భాగంగా వేర్వేరు స్థాయిల్లో ఉన్న ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం కంపెనీ వాహన సేల్స్ తర్వాత వినియోగదారుల నుంచి విరివిగా ఫిర్యాదులు ఎదుర్కొంటున్నది.
ఇప్పటికే కంపెనీకి 10 వేల ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీనిపై కంపెనీకి వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్థ సైతం నోటీసులు సైతం జారీ చేసింది. అందుకు కంపెనీ సమాధానమిస్తూ.. తమకు అందిన ఫిర్యా దుల్లో 99శాతం పరిష్కరించినట్లు నివేదిక సమర్పించింది.
ఇలాంటి సంక్షోభ సమయంలో ఉద్యోగులను పక్కన పెట్టడం బిజినెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కంపెనీ ఈ నెలాఖరులోపు లేఆఫ్ ప్రక్రియ పూర్తి చేస్తుందని తెలిసింది. ప్రస్తుతం కంపెనీ షేర్ల విలువ స్వల్పగాంగా పెరిగింది. ప్రస్తుతం రూ.68 వద్ద నిలకడగా సాగుతున్నది.