calender_icon.png 14 October, 2024 | 7:43 PM

రెండింతలైన ఓలా ఎలక్ట్రిక్ షేరు

20-08-2024 12:30:00 AM

ముంబయి: ప్రముఖ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లుసోమవారం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో 9.99 శాతం పెరిగి రూ. 146.38 వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 64,565.73 కోట్లకు చేరింది. పలు బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్‌పై సానుకూల వైఖరి వ్యక్తం చేసిన నేపథ్యం లోనే స్టాక్ రాణిస్తోందని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు జరిగింది.

ఒక్కో షేరు కు రూ.72-76 ధర నిర్ణయించారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సంస్థ రూ. 6,100 కోట్లు సమీకరించింది. మదుపరులు రూ.14,972తో కనీసం 197 షేర్లకు బిడ్లు దాఖలు చేశారు. ఓలా ఎలక్ట్రిక్ సంస్థ 3 విద్యుత్ మోటార్ సైకిళ్లను విపణిలోకి గురువారం విడుదల చేసింది. ’రోడ్‌స్టార్’ బ్రాండ్‌పై ఈ మోడళ్లను విక్రయించనుంది. తాజా 3 వేరియంట్లు రోడ్‌స్టార్ ఎక్స్, రోడ్‌స్టార్,రోడ్‌స్ట్టార్ ప్రోతో లభిస్తున్నాయి. మరో 2 మోటారుసైకిళ్లను త్వరలో విడుదల చేస్తామని సంస్థ తెలిపింది.