న్యూఢిల్లీ: ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వచ్చే వారు ఐపీఓకు రానుంది. ఆగస్టు 2న రిటైల్ సబ్‌స్క్రిప్షన్ తెరుచుకోనుంది. ఈ మేరకు స్టాక్ మార్కెట్ రెగ్యులే టర్‌కు సమాచారం ఇచ్చింది. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు ఒక రోజు ముందు అంటే ఆగస్టు 1న సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. సుమా రు 1.2 బిలియన్ డాలర్ల నుంచి 11 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు వస్తోంది. సింగపూర్‌కు చెందిన టెమాసెక్ గతేడాది ఫండింగ్ రౌండ్ సందర్బంలో కుపెనీ విలువను 2.4 బిలియన్ డాలర్లుగా నిర్ణయించింది.
ఆ మొత్తంతో పోలిస్తే, కంపెనీ ఐపీఓ వాల్యుయేషన్ 30 శాతం మేర తగ్గడం గమనార్హం. ఐపీఓలో భాగంగా కంపెనీ వ్యవ స్థాపకుడు భవీశ్ అగర్వాల్ 3.79 కోట్ల్ల షేర్ల ను విక్రయించనున్నారు. విద్యుత్ స్కూటర్ల మార్కెట్లో 18 శాతం వాటాతో అగ్రగామిగా ఉన్న ఓలా ఇప్పటికీ నష్టాల్లోనే ఉంది. గతేడాది విద్యుత్ ద్విచక్ర వాహనాలకు ఇచ్చే సబ్సిడీలో కోత పెట్టడంతో తన విక్రయ లక్ష్యాలను పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో ఐపీఓకు వస్తున్న ఆ సంస్థ ఆఫర్ ఫర్ సేల్ కాకుండా.. తాజా పేర్ల విక్రయం ద్వారా రూ.5,500 కోట్లు సమీకరించాలనుకుంటోంది. ఐపీఓ మొత్తం విలు వ ధరల శ్రేణి, ఇతర వివరాలు త్వరలో వెల్ల డికానున్నాయి.