03-04-2025 01:40:03 AM
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్త తెలిపింది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుమతిస్తూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తెలంగాణ ప్రభుత్వానికి సమాచారమందించింది. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం కోసం ఆర్‌అం డ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులకు లేఖ రాయగా బుధవారం అక్కడి నుంచి సమాధానం వచ్చింది.
ఆదిలాబాద్‌లో పౌరవిమా నాశ్రయానికి అనుమతి నేపథ్యంలో అక్కడ భవిష్యత్తులో ఎయిర్‌ఫోర్స్ ట్రెయినింగ్ సెం టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ సనప్ బాజీరావు రామ్‌నాథ్ తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర విమానయానం, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జా యింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు.
మరోవైపు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ఆదిలాబాద్ జి ల్లా ప్రజలతో పాటు, రాష్ట్ర ప్రజలకు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శు భాకాంక్షలు తెలిపారు. అనుమతుల మంజూరీలో సహకరిస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి ధన్యవాదాలు తెలిపారు.