- బెనిఫిట్ షోలను తిరస్కరించిన రాష్ట్రప్రభుత్వం
- తొలిరోజు ఆరు షోలకు అనుమతి
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాం తి): ‘గేమ్ ఛేంజర్’ సినిమా టికెట్ల ధరల పెం పునకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించింది. కానీ.. బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వలేమని నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌కు స్పష్టం చేసింది. అలాగే తొలిరోజు (ఈ నెల 10) ఆరు షోలు (ఉదయం 4 గంటల షో తో సహా), అలాగే 11 నుంచి 19వ తేదీ వర కు 5 షోలు, ప్రదర్శించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మల్టిప్లెక్స్‌లో రూ.150 మేర, ఇతర థియేటర్లలో రూ.100 మేరకు టికెట్ల ధరలు పెరగనున్నాయి. పుష్ప-2 బెనిఫిట్ షో చూసేందుకు వచ్చి, సినిమా థియే టర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పుడు కూడా అదే నిర్ణయానికి కట్టుబడి ఉండి నో చెప్పడం గమనార్హం. ధరల పెంపునకు మాత్రం అంగీకరించడం కొసమెరుపు.