calender_icon.png 27 November, 2024 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త నర్సింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీకి ఓకే

06-11-2024 01:46:40 AM

  1. ‘భవనాలు లేవు.. ఫ్యాకల్టీ లేదు’.. కథనానికి స్పందన
  2. ఎమ్మెస్సీ నర్సింగ్ అర్హత ఉన్న నర్సింగ్ క్యాడర్ సీనియారిటీ జాబితా సిద్ధం!
  3. ఆదేశాలు జారీచేసిన వైద్య విద్య సంచాలకులు

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): ‘భవనాలు లేవు... ఫ్యాక ల్టీ లేదు’ శీర్షికన మంగళవారం విజయ క్రాంతిలో ప్రచురితమైన కథనానికి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. రాష్ట్రం లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 నర్సింగ్ కళాశాలల్లో ఫ్యాకల్టీ లేకుండానే విద్యార్థుల అడ్మిషన్ ప్రారంభమైన తీరుపై కథ నం ప్రచురితమైంది.

16 నర్సింగ్ కళాశాలల వల్ల పేద విద్యార్థులకు ఎందరికో ప్రయోజనం చేకూర నున్నా ఫ్యాకల్టీ లేకుంటే వారికి తరగతులు చెప్పే దుస్థితి ఉండదని విజయక్రాంతిలో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు, వెంటనే వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో నర్సింగ్ ఆఫీసర్లుగా పనిచేస్తూ ఎమ్మెస్సీ (నర్సింగ్) ఉన్న సిబ్బంది సీనియారిటీ జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

మల్టీ జోన్ 1, జోన్ 2 పరిధిలోని సీనియారిటీ లిస్టును అందించాలని, ఈ నెల 7వ తేదీలోపు వివరాలను సమర్పించాలని వైద్య విద్య సంచాలకులు కోరారు. దీంతో కొత్తగా అడ్మిషన్లు తీసుకుంటున్న నర్సింగ్ విద్యార్థులకు ఫ్యాకల్టీ అందుబాటులోకి రానుంది. మరోవైపు తమకు పదోన్నతులు కావాలని కోరుతున్న ఎమ్మెస్సీ అర్హత ఉన్న నర్సింగ్ ఆఫీసర్ల డిమాండ్ కూడా నెరవేరింది.

చాలాకాలంగా తాము పదోన్నతుల కోసం డిమాం డ్ చేస్తున్నామని, విజయక్రాంతి కథనంతో తమ ప్రమోషన్ల ఫైల్ కదిలి నందుకు ఎంతో సంతోషంగా ఉంద ని నర్సింగ్ ఆఫీసర్ల తరఫున పదోన్నతుల కోసం కృషి చేస్తున్న రాపోలు శేఖర్ తెలిపారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినందుకు ఆయన విజయక్రాంతి దినప త్రికకు, వెంటనే స్పందించిన వైద్యా రోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు.