calender_icon.png 16 January, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈడీ విచారణకు ఓకే

16-01-2025 02:25:22 AM

* కేజ్రీవాల్, మనీష్ సిసోడియాను విచారించేందుకు కేంద్రం అనుమతి

* అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఢిల్లీలో కీలక పరిణామం

న్యూఢిల్లీ, జనవరి 15: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణానికి సం బంధించిన మనీ లాండరింగ్  కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతించింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియాను కూడా విచారించేందుకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రజాప్రతినిధులను విచారించాలంటే ఈడీ ముందస్తు అనుమతులను పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ విచారణకు అనుమతి కోరుతూ ఈడీ అధి కారులు గత నెల లెఫ్టెనెంట్ గవర్నర్‌కు లేఖ రాశారు. అధికారులు రాసిన లేఖకు గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం తెలిపారు. 

తాజాగా కేంద్రం కూడా విచారణకు ఓకే చెప్పింది. ఇదిలా ఉంటే న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న కేజ్రీవాల్.. బుధవారం తన నామినేషన్‌ను దాఖ లు చేశారు. అంతకుముందు ఆయన హనుమాన్ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.