- టీజీఐఐసీ, రెవెన్యూ, అటవీ భూములు ఇస్తాం
- రాంపల్లి వైపు పనులు వెంటనే పూర్తి చేయాలి
- జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించిన మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఈ నెల 28న జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చర్లపల్లి స్టేషన్‌కు చేరుకునేందుకు రోడ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్టు ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
సోమవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సహా రైల్వే, ఇండస్ట్రియల్, అటవీ, రెవెన్యూ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రైల్వే టెర్మినల్‌ను చేరుకునేందుకు ఏర్పాటు చేయాల్సిన రోడ్ల విస్తరణకు అవసరమైన భూములు ఇచ్చేందుకు.. టీజీఐఐసీ, రెవె న్యూ, అటవీ భూములు కూడా కేటాయించేందుకు మంత్రి అంగీకరించారు.
రాంపల్లి వైపు రోడ్లు, లైట్లు, ఇతర మౌలిక వసతులు వెంటనే పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని మంత్రి ఆదేశించారు. సమావేశంలో మాజీ ఎంఎల్‌ఏలు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, భేతి సుభాష్ రెడ్డి, తాడూరి శ్రీనివాస్, టీజీఐఐసీ వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి, రైల్వే కన్స్ట్రక్షన్ సీఈ సుబ్రమణ్యం, సీనియర్ డివిజనల్ కోఆర్డినేటర్ రామారావు, రెవె న్యూ అధికారులు పాల్గొన్నారు.
అంతకుముందు చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో రైల్వే, మున్సిపల్, రెవెన్యూ, ఐఐఎల్‌ఏ, ఎలక్ట్రికల్, టౌన్ ప్లానింగ్, అధికారులతో సమావేశమైన ఎం పీ ఈటల రాజేందర్.. 28న జరుగనున్న టెర్మినల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు.