calender_icon.png 31 October, 2024 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒమన్ సముద్రంలో విషాదం.. నౌకా సిబ్బంది గల్లంతు

17-07-2024 10:56:08 AM

దుబాయ్: ఒమన్ సముద్రతీరంలో విషాదం చోటుచేసుకుంది. కొమొరోస్ జెండాతో కూడిన ఆయిల్ ట్యాంకర్ ఒమన్ తీరంలో బోల్తా పడి 16 మంది గల్లంతయ్యారని ఆ దేశ సముద్ర అథారిటీ తెలిపింది. మునిగిన ఓడలో 13 మంది భారత్, ముగ్గురు శ్రీలంకవాసులున్నారని వెల్లడించింది. మునిగిపోయిన ఓడను ప్రెస్టీజ్ ఫాల్కాన్ గా సిబ్బంది గుర్తించారు. పోర్టు టౌన్ దుకమ్ వద్ద రాస్ ముద్రాకకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఓడలో 16 మంది సిబ్బంది ఉన్నట్లు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది. సముద్రంలో చమురు ఉత్పత్తులు లీకైన విషయాన్ని ఇంకా ధృవీకరించలేదని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించబడిందని ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ సోమవారం ఎక్స్ లో ఒక పోస్ట్‌లో తెలిపింది.  ‘ప్రెస్టీజ్ ఫాల్కన్’ సిబ్బందిలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నారని కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. షిప్పింగ్ వెబ్‌సైట్ marinetraffic.com ప్రకారం, ఈ నౌక యెమెన్‌లోని ఓడరేవు నగరమైన ఏడెన్‌కు బయలుదేరింది. ఇది దుబాయ్‌లోని హమ్రియా నౌకాశ్రయం నుండి బయలుదేరిందనిపేర్కొంది. డుక్మ్ పోర్ట్ ఒమన్ ప్రధాన చమురు, గ్యాస్ మైనింగ్ ప్రాజెక్టులకు ప్రధాన కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే.