రైతులకు నూతన సంవత్సర కానుక : మంత్రి తుమ్మల
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): నూతన సంవత్సరంలో తెలంగాణ రైతులు సుఖ సంతోషాలతో పాడి పంటలతో చల్లగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఆయిల్ పామ్ రైతులకు టన్ను పామాయిల్ గెలల ధర రూ.20,506 స్థిరీకరించబడిందన్నారు. నూతన సంవత్సరం కానుకనుగా జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా పాలనలో రుణమాఫీతో రైతు రాజ్యంగా మారిందన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా, సన్నదాన్యంకు రూ.500 బోనస్‌తో రైతాంగానికి మంచిరోజులు వచ్చాయన్నారు.