23-04-2025 06:53:55 PM
అనంతగిరి: ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ తోటలను సాగు చేసినట్లయితే ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని పతాంజలి ఆయిల్ ఫామ్ కంపెనీ కోదాడ డివిజన్ అధికారి పి.వెంకటేష్ బుధవారం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కోదాడ డివిజన్ పరిధిలో పామాయిల్ సాగు చేస్తున్న రైతులు పామాయిల్ గెలలు కోసుకొని రైతులందరికీ దగ్గరగా ఉన్న టీబీ పాలెం కలెక్షన్స్ సెంటర్ నందు తమ పామాయిల్ తోటలో గెలలను వేసి కలెక్షన్ సెంటర్ నందు వేయడం జరుగుతుందని వారు తెలిపారు.
అక్కడ నుండి పతాంజలి కంపెనీ నియమించిన ట్రాన్స్పోర్ట్ ద్వారా సకాలంలో ఫ్యాక్టరీకి చేరవేయడం జరుగుతుందని ఈ మేరకు వారు పేర్కొన్నారు. ఎటువంటి దళారి వ్యవస్థ లేని పంట ఆయిల్ పామ్ పంట, వరి సాగు చేసి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతులు పామాయిల్ సాగు చేసి దళారీ వ్యవస్థని తరిమికొట్టే విధంగా పామాయిల్ పంటను విస్తరించాలని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోదాడ డివిజన్ పరిధిలో ఉన్న రైతులు, తమకు సహకరించిన పతాంజలి కంపెనీ వారికి సూర్యాపేట జిల్లా రైతాంగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. వారి వెంట క్షేత్ర సహాయకులు మట్టపల్లి నరేష్, బాలెబోయిన లక్ష్మణ్, రైతులు ఉన్నారు.