calender_icon.png 5 March, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్‌పామ్ సాగు విస్తరణ లక్ష్యాలను సాధించాలి

05-03-2025 12:00:00 AM

వనపర్తి, మార్చి 4 (విజయక్రాంతి): 2025-26 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఆయిల్ పామ్  సాగు విస్తరణ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో  జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమావే శాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు.

ఏడాదిలో 6,548 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అ య్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మల్లే విధంగా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ విషయంలో  ఏఈవో లు చొరవ తీసుకునేలా సూచించాలని జిల్లా వ్యవసాయ అధికారికి చెప్పారు. మండలాల వారీగా వ్యవసాయ అధికారులకు లక్ష్యాలను ఇచ్చి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు.

ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి జిల్లాలో ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి, ఇప్పటికే ఈ పంటపై  మంచి లాభాలు సాధిస్తు న్న రైతుల పొలాల వద్దకు పర్యటనకు తీసుకువెళ్లాలని కలెక్టర్ సూచించారు.  అదేవి ధంగా, కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో ఇటీవల శంకుస్థాపనకు నోచుకున్న ప్రీ యూనిక్  ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూ నిట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చే యాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ అధికారి గోవిందు నాయ క్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అక్బర్ పాల్గొన్నారు.