calender_icon.png 12 January, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శనీశ్వరునికి భక్తిశ్రద్ధలతో తైలాభిషేకం

12-01-2025 12:30:28 AM

సిరిసిల్ల, జనవరి 11 (విజయ క్రాంతి)ః శని త్రయోదశి సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధ దేవాలయం శ్రీ భీమేశ్వర ఆలయంలో నవగ్రహాలకు తైలాభిషేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. శనీశ్వరునికి శని త్రయోదశి నేపథ్యంలో భక్తులు ప్రత్యేక  పూజలు చేశారు. తైలాభిషేకం చేయడం ద్వారా పుణ్య ఫలాలు లభిస్తాయని అర్చకులు చెబుతున్నారు.