calender_icon.png 3 March, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యో! ఇ‘సు’క బొక్కుడు కుదరదే!

02-03-2025 12:12:01 AM

దందాలు చేసేటోళ్లకు ఒక్కసారిగా ఆ దందా బందైతే చేతులు విరిగిపోయినంత పనైతది. అలవాటైన పానం ఆగ మాగమైతది. ఇప్పుడు ఇసుక దందా చేసేటోళ్ల పని గట్లనే ఉన్నది. ప్రజలకు డైరెక్ట్‌గా ఇసు క సరఫరా చేయాలని సర్కార్ డిసైడ్ కావడంతో సాండ్ మాఫియాకు నిద్రకరువైంది. ఇగ వాళ్ల ఆటలు సాగేటట్టు కనపడకపోవడంతో తెగ పరేషాన్ అవుతున్నరు.

సర్కార్ ఇప్పటికే ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది.. అధికారులు తనిఖీల జోరు పెంచారు. త్వరలోనే ప్రభుత్వం స్టాక్ పాయింట్లు తెరవబోతోంది. దీంతో ఇన్నాళ్లు ఇసుక అక్రమ రవాణాతో కోట్లు మింగిన అక్రమార్కులు.. స్టాక్ పాయింట్లు ఓపెన్ అయితే.. తాము ఇ‘సు’క బొక్కుడు కుదరదు అని మధనపడిపోతున్నరు.

కొడవలికంటి నవీన్