సెంట్ లూసియా: టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్ పోరాటం ముగిసింది. ఆస్ట్రేలియాపై గెలిచి సూపర్ అడుగుపెట్టాలన్న ఆ జట్టు కల నెరవేరలేదు. ఆదివారం గ్రూప్ ఆస్ట్రేలియాతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్ 5 వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాటిం గ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్‌ముల్లన్ (34 బంతుల్లో 60, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిచీ బెరింగ్టన్ (31 బంతుల్లో 42 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు), జార్జ్ మున్సే (23 బంతుల్లో 35, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆస్టన్ అగర్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపాలు తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్ (49 బంతుల్లో 68, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మార్కస్ స్టోయినిస్ (29 బంతుల్లో 59, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంకర ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా.. టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 24 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్, షరీఫ్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాడ్ వీల్ ఒక వికెట్ తీశాడు. మార్కస్ స్టోయినిస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచు కున్నాడు. లీగ్ దశలో అపజయమే ఎరుగని ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్ అర్హత సాధించగా.. మెరుగైన నెట్న్‌ర్రేట్ లేని కారణంగా స్కాట్లాండ్ టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది.
మెక్‌ముల్లన్ మెరుపులు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ ఆరంభంలోనే మైకెల్ జోన్స్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో మున్సేతో జత కలిసి మెక్‌ముల్లన్ భారీ హిట్టింగ్‌తో స్కోరుబోర్డును పరిగెత్తించాడు. అనంతరం మున్సే వెనుదిరిగినప్పటికి ఆ తర్వాత కెప్టెన్ రిచీ బెరింగ్టన్ అండతో మెక్‌ముల్లన్ మరింత రెచ్చిపో యాడు. ఈ ఇద్దరు ధాటిగా ఆడడంతో ఇన్నింగ్స్ 11వ ఓవర్లో స్కాట్లాండ్ 100 పరుగుల మార్క్‌ను దాటింది. అనంతరం మెక్ ముల్లన్ వెనుదిరిగినప్పటికి మాథ్యూ క్రాస్ సాయంతో బెరింగ్టన్ నిలకడగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.
స్టోయినిస్ అదరహో..
181 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ ఎదురైంది. డేవి డ్ వార్నర్ (1) వీల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ (8), మ్యాక్స్‌వెల్ (11) కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. దీంతో 60 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ హెడ్‌కు జత కలిసిన స్టోయినిస్ ప్రారంభంలో కాస్త నిధానంగా ఆడాడు. మరోవైపు హెడ్ మాత్రం స్కాట్లాండ్ బౌలర్లలపై విరుచుకుపడ్డాడు. స్టోయినిస్ కూడా క్రీజులో కుదురుకున్న తర్వాత విశ్వరూపం ప్రదర్శించాడు. స్కాట్లాండ్ బౌలర్లను చీల్చి చెండాడుతూ ఎడాపెడా బౌండరీలు బాదా డు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. అనంతరం హెడ్, స్టోయి నిస్‌కు స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్‌లు మిగతా పనిని పూర్తి చేసి ఆసీస్‌ను గెలిపించారు.
స్కోరు వివరాలు
స్కాట్లాండ్: మున్సే (సి) ఎల్లిస్ (బి) మ్యాక్స్‌వెల్ 35, జోన్స్ (బి) అగర్ 2, మెక్‌ముల్లన్ (సి) స్టార్క్ (బి) జంపా 60, బెరింగ్టన్ (నాటౌట్) 42, మాథ్యూ క్రాస్ (సి) అగర్ (బి) మ్యాక్స్‌వెల్ 18, లీస్క్ (సి) స్టార్క్ (బి) ఎల్లిస్ 5, క్రిస్ గ్రీవ్స్ (నాటౌట్) 9,
ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం : 20 ఓవర్లలో 180/5.
వికెట్ల పతనం: 1 2 111 4 5
బౌలింగ్ : ఆగర్ 4 స్టార్క్ 4 ఎల్లిస్ 4 34 మ్యాక్స్‌వెల్ 4 జంపా 4
ఆస్ట్రేలియా: హెడ్ (సి) జోన్స్ (బి) షరీఫ్ 68, వార్నర్ (సి) బెరింగ్టన్ (బి) వీల్ 1, మార్ష్ (సి) టియర్ (బి) షరీఫ్ 1, మ్యాక్స్‌వెల్ (బి) వాట్ 11, స్టోయినిస్ (బి) వాట్ 59, టిమ్ డేవిడ్ (నాటౌట్) 24, వేడ్ (నాటౌట్) 4,
ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం 19.4 ఓవర్లలో 186/5.
వికెట్ల పతనం: 1 2 3 4 5
బౌలింగ్: లీస్క్ 4 వీల్ 3.4 మార్క్ వాట్ 4 సోల్ 3 షరీఫ్ 4 గ్రీవ్స్ 1 4