calender_icon.png 15 November, 2024 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యో పాకిస్థాన్!

15-06-2024 01:22:17 AM

  • అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ వర్షార్పణం

మాజీ చాంపియన్ పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ! అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అమెరికా చేతిలో పరాజయం పాలై పెను విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్.. ఇప్పుడు అమెరికా, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షార్పణమవడంతో సూపర్ దశకు చేరకుండానే వెనుదిరిగింది. శుక్రవారం గ్రూప్ భాగంగా ఫ్లోరిడా వేదికగా జరగాల్సిన అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దుంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఫలితంగా.. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు ఒక ఓటమితో 5 పాయింట్లు ఖాతాలో వేసుకున్న అమెరికా జట్టు సూపర్ అర్హత సాధించింది.

ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే టీమిండియా ముందంజ వేయగా.. ఇప్పుడు పాకిస్థాన్‌ను తోసిరాజని తొలిసారి ఆడుతున్న ప్రపంచకప్‌లోనూ అమెరికా సూపర్ చేరి అదుర్స్ అనిపించింది. మూడు మ్యాచ్‌ల్లో ఒకే విజయంతో రెండు పాయింట్లతో ఉన్న పాకిస్థాన్ ఇక చివరి మ్యాచ్‌లో నెగ్గిన ఫలితం లేకుండా పోయింది. అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ సజావుగా సాగాలని ప్రార్థించిన పాకిస్థాన్‌కు నిరాశే ఎదురైంది. 

ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుందన్నట్లు..

ఈ టోర్నీలో ఆతిథ్య హోదాలో బరిలోకి దిగి కఠిన ప్రత్యర్థులతో సైతం గిరిగీసి కొట్లాడిన అమెరికా సూపర్ చేరి సంచలనం సృష్టించింది. పాకిస్థాన్‌పై సూపర్ ఓవర్‌లో ఉత్కంఠ విజయం సాధించిన అమెరికా.. టీమిండియాకు సైతం ఓటమి భయం రుచిచూపింది. ఇదే జోరు కొనసాగిస్తే సూపర్ అమెరికా సంచలనాలు నమోదు చేయడం ఖాయమే.