calender_icon.png 14 March, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యో పాపం.. పసిపాప

28-08-2024 12:27:35 AM

చెత్తకుప్పలో మృత శిశువు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఆ బిడ్డకు పుట్టగానే నూరేళ్లు నిండిపోయాయి. భువిపైకి వచ్చిన గంటల వ్యవధిలోనే చెత్తకుప్పలో ఆ పసిపాప మృతదేహాన్ని చూసిన బాటసారులు, స్థానికులు కంటతడి పెట్టారు. మంగళవారం నగరం నడిబొడ్డున ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఎవరో అప్పుడే పుట్టిన పసికందును ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి సైఫాబాద్ పీఎస్ పరిధిలోని లక్డీకాపూల్ బ్రిడ్జిపై నుంచి విసిరేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు పసికందు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తల్లిదండ్రులు ఎవరు? ఎలా మృతి చెందింది. ఎవరు తెచ్చి పడేశారు అనే వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.