‘ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అందెలలో చిక్కుకుంది నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే’
వాలెంటైన్స్ డే వీక్ సందర్భంగా..
ఈ పాట ప్రేమికుడు సినిమాలోనిది.. ఇప్పటికీ పాటలోని మాధుర్యం ఏ మాత్రం తగ్గలేదు. నిజానికి ప్రేమకు వయసుతో పనిలేదు ఎవరికైనా కలుగుతుంది. ప్రకృతిలోని ప్రతి జీవి దీన్ని అనుభూతి చెందుతుంది. అలాగని ఈ ప్రేమనేది కల్పించుకుని పుట్టేది కాదు. పువ్వు వికసించేంత సహజంగా.. ప్రకృతి పులకించేంత సహజంగా జరగాల్సిన ప్రక్రియ.
ప్రేమ అనేది మనిషికి దక్కిన ఒక అద్భుత వరం. ఇష్టపడ్డ ఇద్దరు వ్యక్తుల మధ్య అనిర్వచనీయమైన బాంధవ్యాన్ని కలిగించేది ప్రేమ. దీనికి ముసలితనం లేదు. మరణం లేదు. ఇది ఎప్పుడూ నిత్య నూతనం. అందుకే దీన్ని అజరం..
అమరం అనేది. ప్రేమికులకు ఫిబ్రవరి రెండో వారం.. ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. వాలెంటైన్ వీక్‌లో ప్రతిరోజుకు ఉన్న విశేషాలేంటో తెలుసుకుందాం..
రోజ్ డే: వాలెంటైన్ వీక్ అనేది రోజ్ డేతో స్టార్ట్ అవుతుంది. రోజ్ డేను ఫిబ్రవరి ఏడున జరుపుకుంటారు. ఈ రోజును ప్రేమ జంటలు ఒకరికొకరు గులాబీ పువ్వులను లేదా పూల బొకేలను ఇచ్చుకుంటారు. ఇలా పువ్వుల ద్వారా ప్రేమను వ్యక్తపరచడానికి ఒక అర్థం ఉంది. గులాబీల తాజాదనం, సువాసన అనేది ప్రేమికుల మధ్య మాధుర్యాన్ని తీసుకువస్తుందని ప్రేమికుల నమ్మకం.
ప్రపోజ్ డే: ప్రపోజ్ డేను ఫిబ్రవరి ఎనిమిది అంటే ఇవాళే సెలబ్రేట్ చేసుకుంటారు. లవర్స్ తమ ప్రేమను వ్యక్తపరిచే రోజు ఇది. ఈ రోజున అందమైన గిఫ్ట్‌తో తమలోని ప్రేమను వ్యక్తపరచుకుంటారు.
చాక్లెట్ డే: ఫిబ్రవరి తొమ్మిదిన చాక్లెట్ డేను జరుపుకుంటారు. ఈ రోజు లవర్స్ ఒకరికొకరు చాక్లెట్‌లను బహుమతిగా ఇచ్చి.. తమలోని ప్రేమను వ్యక్తపరచుకుంటారు.
టెడ్డీ డే: వాలెంటైన్స్ వీక్‌లో నాలుగో రోజు టెడ్డీ డే. ఈ రోజున ప్రియుడు తమ ప్రేయసికి అందమైన టెడ్డీని గిఫ్ట్‌గా ఇస్తాడు. నార్మల్‌గా అమ్మాయిలకు టెడ్డీబేర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి.. టెడ్డీతో ప్రేమను వ్యక్తపరచి ఇంప్రెస్ చేస్తారు. టెడ్డీ డేను ఫిబ్రవరి పదిన జరుపుకుంటారు.
ప్రామిస్ డే: ప్రామిస్ డే.. దీన్ని ఫిబ్రవరి 11న సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు లవర్స్ తమ ప్రేమబంధంలో కలిసి కలకాలం ఉండాలని ప్రామిస్ చేసుకుంటారు. ఈ రోజు చేసుకున్న ప్రామిస్‌లను జీవితాంతం పాటిస్తామని వాగ్దానం చేస్తారు.
హగ్ డే: వాలెంటైన్స్ వీక్‌లో ఆరవ రోజు హగ్ డే. దీన్ని ఫిబ్రవరి 12న జరుపుకుంటారు. ఈ రోజు లవర్స్ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. అలా చేయడం వల్ల మనసులోని బాధలు, సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి.
కిస్ డే: ప్రేమికులకు ఈ రోజు అంటే ఎంతో ఇష్టం. దీన్ని ఫిబ్రవరి 13న జరుపుకుంటారు. లోతైన ప్రేమకు, సాన్నిహిత్యానికి, ఆప్యాయతకు ముద్దు ఒక చిహ్నం.
వాలెంటైన్స్ డే: వాలెంటైన్స్ వీక్‌లో చివరి రోజు వాలెంటైన్ డే. దీన్ని ఫిబ్రవరి 14న జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు ఒకరినొకరు సమయాన్ని ఇచ్చి తమ బంధాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పటి వరకు ఇచ్చిన బహుమతులు, హావభావాలతో ప్రేమను ప్రత్యేకంగా వ్యక్తపరుస్తారు.