calender_icon.png 26 October, 2024 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఓ గెరిల్లా డాక్టర్!

01-07-2024 12:00:00 AM

హెన్రీ నార్మన్ బెథూన్.. టొరంటోకి 160 కి.మీ. దూరంలోని గ్రావెన్హరస్ట్‌లో 1890 మార్చి 3న పుట్టాడు నార్మన్ బెథూన్. బెథూన్ తాత నార్మన్ మిలటరీ సర్జన్. రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డునాంట్‌తో కలిసి నాటి క్రిమియా యుద్ధకాలంలో పనిచేశారు. వైద్యుల కుటుంబానికి చెందిన బెథూన్ 1909లో టొరంటో యూనివర్సిటీలో ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ చదివాడు. చదువు ఖర్చుల కోసం కొందరికి ఇంగ్లిష్ నేర్పేవాడు. స్థానిక పత్రికకి విలేకరిగానూ పనిచేశాడు. నిక్కచ్చి మనిషి. దూసుకుపోయే తత్వం. జనం కోసం ఏమన్నా చేయాలన్న తపన. 1914 సెప్టెంబర్‌లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. అప్పటికి బెథూన్ వయసు 24 ఏళ్లు. ఫ్రాన్స్ వెళ్లాడు. స్ట్రెచర్  మోసే పని. గాయపడిన సైనికులను గబగబా స్ట్రెచర్ మీద తీసుకెళ్లడం. ఆరు నెలల తర్వాత బెల్జియంలో జరిగిన యుద్ధరంగానికెళ్లాడు.

అక్కడో పదునైన ఆయుధం కాల్లో గుచ్చుకుంది. వెనక్కివచ్చి 1916 కల్లా మెడిసిన్ పూర్తిచేశాడు. 1917 నుంచి మళ్లీ యుద్ధంలోకి.. పూర్తి అయ్యేదాకా నేవీ సర్జన్‌గా పనిచేశాడు. ఇంగ్లండ్, ఫ్రాన్స్ వెళ్లి బెథూన్ పరికరాలు తెచ్చాడు. ఒక రిఫ్రిజిరేటర్, ఇంక్యుబేటర్, స్టెరిలైజర్ యూనిట్తో రక్తమార్పిడి సర్వీసు ప్రారంభించాడు. బెథూన్ కొత్త ఆలోచన, చురుకైన పనితనం చూసి అంతా ఆశ్చర్యపోయారు. వెయ్యి కిలోమీటర్లు విస్తరించిన యుద్ధరంగంలో 100 ఆస్పత్రుల్లో ఈ యూనిట్లతో పని మొదలుపెట్టారు. గాయపడ్డ కొన్ని వందలమందిని ఆదుకున్నారు. ఒక మంచి సర్జను కావాలంటే, ఒకే సమయంలో కమ్మరి, వడ్రంగి, దర్జీ, మంగలి అన్నీ కాగలగాలి అనే వారు బెథూన్. వేల మంది జనం వచ్చి సరిహద్దులోని ఆ ఆస్పత్రిని చూసి వెళ్లారు. యుద్ధంలో గాయపడ్డ సైనికులు మన దగ్గరకు రావడం కాదు, మనమే గాయపడ్డ వారి దగ్గరికి వెళ్లాలని బెథూన్ చెప్పారు.

గుర్రాల మీద పర్వతాలు దాటడం, ఎక్కడికక్కడే వైద్యం చేయడం, ఒక గ్రామంలో ఉన్న చిన్న ఆస్పత్రిలాంటి దాన్ని ఆపరేషన్ థియేటర్‌గా మార్చాడు. ప్రజల ఇళ్ల మధ్య శత్రువుకి కనిపించకుండా వుండేది. ఆపరేషన్‌లో సరిగ్గా చేయడం కోసం గుమ్మడికాయలకి క్షవరం చేసి వాటికి గాట్లు పెట్టాలని విద్యార్థులకు చెప్పేవాడు. మత్తు మందు ఇవ్వడం ఎలాగో నేర్పేవాడు. బెథూన్ మరణం అనంతరం స్మారక మందిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీఏటా వేలమంది దానిని సందర్శిస్తూ వుంటారు. కష్టాల్లోవున్న ఇతరుల సహాయం చేయడమే జీవితానికి అర్థం అని.. బెథూన్ ఆదర్శం మనకి చెప్తోంది.