24-02-2025 12:00:00 AM
నేను
దానిని ఏమీ అనలేదు
పనిలో పడి పలకరించ లేదంతే
తోక ఊపడం కాదు కదా
కన్నెత్తి చూడటం లేదు!
మనుషుల మధ్య అయినా అంతే
మాటలు కరువైతే
గోడలు మొలుస్తాయి!
దూరాలు చెరిపేయడానికి
మాటలే కదా దివ్య ఔషధాలు
పలకరింపులు
స్నేహానికి పసితనాలు అద్దుతాయి!
రోజు మాట్లాడుకోవడానికి
ఏముంటాయి?
అట్లా అనుకోవడం
పొరపాటు సుమా
ప్రయాణాలు ఆగిపోయినంత ప్రమాదం
నిత్యం కలిసి కలబోసు
కోవలసిన వారం
కాలం విసిరివేతకు దూరమయ్యాం!
ఇప్పుడు మాటొక్కటే కదా
కరచాలనాలను కౌగిలింతలను
ప్రసాదించేది!
ఏముందబ్బా
పోతూపోతూ నాలుగు మాటలను
ఏ కమ్మమీదో అతికించి పోతాం
గుండెకు అద్దుకునే
ఒకరిద్దరూ కలిగి ఉండడమే
మనకు మిగిలిపోయే
శాశ్వత చిరునామా!!
9440233261