calender_icon.png 23 December, 2024 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యో.. ‘పాప’ం !

04-08-2024 12:00:00 AM

బకెట్లో పడి నెలల చిన్నారి మృతి 

పరిగి, ఆగస్టు 3 (విజయక్రాంతి): తల్లిదండ్రుల నిర్లక్ష్యమో.. మరేదైనా కారణమో తెలియదు గానీ ముక్కుపచ్చలారని ఎనిమిది నెలల పాప బకెట్లో పడి ప్రాణాలొదిలింది. ఈ హృదయ విదారక ఘటన పరిగి మున్సిపాలిటీలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. బీహార్‌కు చెందిన దంపతులు కొన్నాళ్ల నుంచి పరిగి పట్టణంలోని టీచర్స్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. వారికి ఎనిమిది నెలల పాప. పాప తండ్రి పట్టణంలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, తల్లి చిన్నారిని చూసుకుంటూ ఇంటి వద్దనే ఉం టుంది. శనివారం సాయంత్రం చిన్నారి ఆడుకుంటుండగా తల్లి బాత్‌రూమ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో పాప ఆడుకుంటూ వెళ్లి నీళ్లున్న బకెట్‌లో తలకిందులుగా పడింది. బాత్ రూంకు వెళ్లొచ్చిన తల్లి బకెట్‌లో అచేతనంగా ఉన్న చిన్నారిని బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పాపను పరీక్షించి అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. దీం తో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు గా విలపించారు. ఘటనపై పరిగి పోలీసులను వివరణ కోరగా.. పాప మృతిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.