కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి సీపీఐ జాతీయ కార్యవర్గం సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి సమక్షంలో సీపీఐ లో చేరారు. ఆదివారం మండలంలోని ఇందుర్తి గ్రామ శివారులో గల ముస్కు రాజిరెడ్డి స్మారక స్తూపం వద్ద రాజిరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన చాడ వెంకటరెడ్డి సమక్షంలో జయపాల్ రెడ్డి సీపీఐ లో చేరారు. చాడ వెంకటరెడ్డి జయపాల్ రెడ్డికి సిపిఐ కండువా కప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో పార్టీని బలోపేతం చేయడం కోసం, సర్పంచ్ లు,ఎంపీటీసీలు, జడ్పిటిసి గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని జయపాల్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి కౌన్సిల్ సభ్యులు ఇల్లందుల రాజయ్య, ముస్కు శ్రీనివాసరెడ్డి, అంజారెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.