calender_icon.png 18 October, 2024 | 2:06 PM

తీరం దాటిన వాయుగుండం

18-10-2024 02:49:26 AM

ఐదు రోజులు వర్షాలు

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం గురువారం బలహీనపడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం మాత్రం కొనసాగుతోందని చెప్పింది. శుక్రవారం నాటికి అల్పపీడనం మరిం త బలహీనపడుతుందని వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నది.