calender_icon.png 24 December, 2024 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయక్రాంతి ఎఫెక్ట్. ..అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం..

23-12-2024 10:48:04 PM

విజయక్రాంతి కథనానికి స్పందించిన అధికారులు...

బోడుప్పల్ మేయర్ అజయ్ యాదవ్ ఆదేశాలతో అక్రమ నిర్మాణాలు నెలమట్టం..

ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, షెడ్లు కూల్చివేసిన అధికారులు.

ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మేయర్. 

మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలువైన ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మణాలు నానాటికీ పెరిగిపోవడం అలాగే కొందరు స్వార్థ రాజకీయ నాయకుల అండతో అనుమతులు లేని అక్రమ నిర్మాణాల కారణంగా మున్సిపల్ అదాయానికి గండి పడుతుండడంతో పాటు నగర పరిధిలోని సర్వే నంబర్ 63/1 దేవేందర్ నగర్ ఫైజ్-2లో, అంబేద్కర్ నగర్ ఫేజ్-3లో ప్రభుత్వ భూమిలో కబ్జాదారులు రాత్రికి రాత్రే అధికారుల కళ్ళుకప్పి ఇళ్లు నిర్మిస్తుండటం రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు సవాలుగా మారడంతో వీటిని అరికట్టాలని మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ఛాలెంజ్ గా స్వీకరించారు. 

ఈ అక్రమ నిర్మాణాలపై “బోడుప్పల్ లో భూమాఫియా” శీర్షికతో వచ్చిన కథనంతో మేయర్ తోటకూర అజయ్ యాదవ్ స్పందించి ఆదేశాల మేరకు మున్సిపల్, రెవిన్యూ అధికారులు పోలీసులు బందొబస్తు మధ్య సోమవారం అక్రమ నిర్మాణలపై ఉక్కుపాదం మోపారు. మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తిస్తే వాటిని కూల్చివేయకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మరోసారి ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు చెప్పడతామని హెచ్చరించారు. మేయర్ అజయ్ యాదవ్ నగర సమగ్రాభివృద్ధి కై తీసుకుంటున్న చర్యలు, పనితీరుపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.