calender_icon.png 23 October, 2024 | 11:06 AM

ఎల్‌ఎండీ గేట్లు ఎత్తిన అధికారులు

07-10-2024 12:00:00 AM

5 వేల క్యూసెక్కుల నీటి విడుదల

మానకొండూర్, అక్టోబరు 6: కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు వస్తుండటంతో ఎస్సారెస్పీ అధికారులు ఆదివారం రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గత నెలలో మిడ్ మానేరు నుంచి ఎల్‌ఎండీలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.

మళ్లీ రిజర్వాయర్‌లో పూర్తి నీటి సామర్థ్యం ఉండటంతో మరో రెండు గేట్లను ఎత్తి దిగువకు రెండోసారి వదిలారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు మిడ్ మానేరు నుంచి రిజర్వాయర్‌లోకి వరద నీరు రావడంతో మూడోసారి గేట్లను ఎత్తారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్ సామర్థ్యం 24.034 టీఎంసీలకుగాను 23.947 టీఎంసీల నీరు ఉంది. 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.