07-02-2025 01:20:31 AM
నారాయణపేట, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): కొస్గి మండల పరిధిలోని నాచారం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కు వంట ఏజెన్సీ నిర్వాహకులకు మధ్య జరిగిన గొడవతో మధ్యహ్న భోజనం ఆగిపోవటంతో ధర్నా చేపట్టిన నేపథ్యంలో గురువారం మండల పరిధిలో నీ నాచారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి గోవింద రాజులు, డిఆర్ డి ఓ మొ గులప్పలు తనిఖీ చేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంట ఏజెన్సీ నిర్వ హకులతో ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. లిఖిత పూర్వకంగా పత్రాలను వ్రాసుకున్న తరువాత. మరోమారు పునరావృతం కా కుండా చూడాలని ఒకవేళ మళ్ళీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే చర్యలు తప్ప వని ఈసందర్భంగా వారు హెచ్చరించారు.
గ్రామస్తులు పలువురు ప్రధానోపాధ్యాయు లును మార్చాలని పిర్యాదు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొంటా మని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ తనిఖీలో మండల తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడి ఓ శ్రీధర్, ఎంఈ ఓ శంకర్ నాయక్ తది తరులు పాల్గొన్నారు.