calender_icon.png 31 March, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి సమస్యకు పరిష్కారం చూపని అధికారులు

28-03-2025 03:09:28 PM

చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న పంచాయితీ కార్యదర్శి

త్రాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్థులు 

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాసదాశివ నగర్ మండలం(Sadashiva Nagar Mandal,) భూంపల్లి గ్రామంలో త్రాగునీటి కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి నీటి సమస్య విషయం తీసుకువెళ్లిన చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు.  గ్రామంలో నీరు కావాలంటే గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బోరు వద్ద నుండి నీళ్లు తెచ్చుకుంటున్నామని   పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లిన గ్రామపంచాయతీలో నిధులు లేవని ఎక్కడినుండి నిధులు తేవాలని విడ్డురణగా సమాధానం ఇస్తున్నారన్నారు.  గ్రామంలో  నీటి సమస్య పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లిన ఆమె చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందని గ్రామస్తులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమస్యలు పట్టని విధంగా భూంపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి వ్యవహరిస్తుందని  గ్రామస్తులు వాపోతున్నారు.

భూంపల్లి గ్రామంలో  నీటి సమస్య(Water problem) లేకుండా ఒక పైప్ లైన్ త వ్వించి నీటి సమస్య పరిష్కరించాలని వివరించగా ఆమె సమాధానం చెప్పకుండా గ్రామ పంచాయతీలో నిధులు లేవని మాత్రమే చెప్పి తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు.  భూంపల్లి గ్రామంలో నీటి సమస్య పరిష్కరించాలని స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి ,ప్రత్యేక దృష్టి సాధించి ఏడో వార్డులో నీటి పైపు తవ్వించి ప్రజల దాహం తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన కొందరు పంచాయతీ కార్యదర్శులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శుల కు నీటి వసతులపై అవగాహన ఉండాలని కలెక్టర్ వివరించినా కానీ కొందరు పంచాయతీ కార్యదర్శుల  తీరు మారడం లేదన్నారు.

తాగునీటి సమస్యలు రాకుండా చూడవలసిన బాధ్యత పంచాయతీ కార్యదర్శిలపై ఉందని కలెక్టర్ గ్రామాలలో ఉన్న ట్యాంకర్ అందుబాటులోకి తీసుకురావాలని ఏమైనా మరమ్మత్తులు ఉంటే చేయించాలని సూచించిన భూంపల్లి పంచాయతీ కార్యదర్శి కలెక్టర్ చెప్పిన వాటికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిపారు. భూంపల్లి గ్రామంలో ఉన్న ఊరడి చిన్న పెంటయ్య బోరు వద్ద నుండి తాగడానికి మంచినీరు బైకులపై ట్రాక్టర్ల పై తీసుకురావడం జరుగుతుంద న్నారు. ఏడో వార్డులో నీటి సమస్య ఉందని పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లిన కానీ మీరు ఫస్ట్ మీ గ్రామం నుండి డబ్బులు పెట్టుకోండి, బిల్లు రాగానే నేను ఇప్పిస్తానని గ్రామ కార్యదర్శి చెప్పడం గమనార్ధం. ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇలా మాట్లాడడం పై గ్రామస్తులు  చర్చించుకుంటున్నారు. గ్రామంలో నీటి సమస్య పరిష్కరించడంలో విఫలమవుతున్నభూంపల్లి పంచాయతీ కార్యదర్శి పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.