- ఆకస్మిక తనిఖీలతో బిజీబిజీ
- సమస్యలు, వసతులపై ఆరా
- భవిష్యత్‌లో తనిఖీలను విస్తృతం చేసే అవకాశం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన విభాగాధిపతులు, జిల్లాస్థాయి అధికారులు సంక్షేమ హాస్టళ్ల బాట పట్టారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ సంక్షేమ హాస్టళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్లు సం బంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. వారంతా హాస్టళ్ల బాటపట్టా రు. వసతిగృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారుల పర్యటనలు సాగుతున్నాయి.
హాస్టళ్లలోని పరిశుభ్రత, విద్యార్థు ల ఆరోగ్యంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పౌరసరఫరాల శాఖ అధికారులు కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. దీంతో కలెక్టర్ నుంచి జిల్లాస్థాయి అధికారులంతా సంక్షేమ హాస్టళ్లను దిగ్భందనం చేసిన ట్లవుతోంది. దీంతో ఏ క్షణంలో ఏ అధికారి తమ హాస్టల్ తనిఖీకి వస్తారనే భయంతో వార్డెన్లు హాస్టళ్లలో ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. రెసిడెన్షియల్ హాస్టళ్లలో నూ తనిఖీలు చేపట్టబోతున్నట్లు సమాచారం.
మెనూ, సమస్యలపై ఆరా..
జిల్లాలోని హాస్టళ్ల తనిఖీల్లో భాగంగా ప్రత్యేకాధికారులు హాస్టళ్లలో పరిసరాలు, మరుగు దొడ్లు, పరిశుభ్రత, మంచినీరు, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం, సన్న బియ్యం తో భోజనం పెడుతున్నారా లేదా.. అనే అంశాలను పరిశీలిస్తున్నారు. విద్యార్థుల హాజరు, సరుకుల రికార్డులు, స్టోరేజీ వివరాలను పరిశీలిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఆరా తీస్తూ వసతి గృహాల అధికారులకు సూచనలు చేస్తున్నారు. అవసరమైతే అక్కడే బస చేస్తున్నా రు. దీంతో నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్‌డ బ్ల్యూవోలు, సిబ్బందికి హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న తనిఖీలను విస్తృతం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆరుగురు ప్రత్యేకాధికారులు..
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా.. జిల్లాలో ఆరుగురు ప్రత్యేకాధికారులను కలెక్టర్ నియమించారు. తనిఖీలు చేస్తున్న ఆయా అధికారులు విద్యార్థులతోనే కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటు న్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలను అందజేస్తున్నారు. ప్రతీ అధికారికి పది బీసీ హాస్టళ్లను కేటాయించినట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు కొనసాగే ఈ స్పెషల్ డ్రైవ్‌కి ప్రత్యేకాధికారులు గా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభివృద్ధి శాఖల జిల్లా అధికారులు ఆశన్న, యాద య్య, కోటాజీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమే ష్, జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సురేందర్, జీఎండీఐసీ పవన్‌కుమార్‌ను కలెక్టర్ నియమించారు.