03-03-2025 12:00:00 AM
కరీంనగర్, మార్చి 2 (విజయక్రాంతి) : నేటి నుండి ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ మొదలు కానుండగా, దీనికోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్లు కోసం ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా, ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్‌వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. కాగా ఆదివారం మాక్ కౌంటింగ్ ను ఎన్నికల అధికారులు చేపట్టారు.