ముత్తారం, జనవరి 3: చంద్రాపూర్ టు విజయవాడ వరకు నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి పనులకు శుక్రవారం ముత్తారం మండలంలోని మైదాంబండ, పోతారం గ్రామాలలో తాసిల్దార్ సుమన్ ఆధ్వర్యంలో ఎస్ఐ నరేష్ తో పాటు రైతుల సమక్షంలో ట్రెంచి కొట్టారు.
ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ జాతీయ రహదారికి రైతులు ప్రజలు సహకరించాలని కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు భూములు కోల్పోతున్న రైతులకు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు నష్టపరిహారం చెల్లించామని, కొంతమంది ఈ పనులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, భూ ములు కోల్పోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని తాసిల్దార్ హామీ ఇచ్చారు.
ఈ కార్య క్రమంలో సీనియర్ అసిస్టెంట్ భవానీ ప్రసాద్, ఆర్ఐ రాజబాబు, శ్రీధర్, మాజీ సర్పం నెత్తెట్ల మహేందర్, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.