calender_icon.png 17 March, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణికి అధికారుల డుమ్మా..

17-03-2025 05:04:42 PM

సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారికి అందుబాటులో లేని అధికారులు..

పెద్ద కొడఫ్గల్ (విజయక్రాంతి): పేద ప్రజలు తమ సమస్యలను పరిష్కారం కోరుతూ ప్రతి సోమవారం మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి సమస్యల పరిష్కారం కోసం బాధితులు వస్తున్న సంబంధిత శాఖ అధికారులు డుమ్మా కొడుతున్నారు. దీంతో మండల కేంద్రానికి వచ్చిన వివిధ గ్రామాలకు చెందిన బాధితులు ప్రజావాణిలో ఎవరికి ఏమి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసిల్దార్ దశరథ్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు త్వరితంగా పరిష్కారం కావడానికి ఉన్నతాధికారులు మండల కేంద్రాలలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేశారు.

అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించాలని సదుద్దేశంతో స్థానిక అధికారులు వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు హాజరై బాధితుల ఆర్జీలు తీసుకొని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది. కానీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా గత కొన్ని వారాలుగా అధికారులు పెద్ద కొడంగల్ తాహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరు అవుతున్నారు. ప్రజావాణికి డుమ్మా కొట్టే అధికారులపై సిబ్బందిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే కోరుతున్న జిల్లా అధికారులు మండల అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం అధికారులు డుమ్మాలు కొడుతున్నారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణికి కూడా కొన్ని శాఖల అధికారులు గైర్హాజరు అయ్యారు. కొన్ని శాఖల అధికారులు రాకపోయేసరికి బాధితులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అందుబాటులో లేకుండా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం ఎందుకని ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకున్నప్పుడు ప్రభుత్వ ఆశయాలు నీరుగారుతుందన్నారు. అధికారులు అందుబాటులో లేక సమస్యలు ఎదురవుతున్నాయని ఆర్జీదారులు వాపోతున్నారు. గైర్హాజరు అయినా అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్జిదారులు, మండల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారుల మార్పు వస్తుందా లేక ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.