- ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపాటు
- ప్రొటోకాల్ పాటించడం లేదని నిరసన
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 1(విజయక్రాంతి): సర్కారుకు అధికారులు కొమ్ముకాస్తూ, అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం బీఆర్‌ఎస్ నాయకులతో కలసి కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోవ లక్ష్మి మాట్లాడుతూ.. ఆదివారం మంత్రి సీతక జిల్లా పర్యటనలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదన్నారు. ఎలాంటి పదవులు లేని కాంగ్రెస్ నాయకులు అధికారిక కార్యక్రమాల్లో ఎలా ప్రారంభోత్సవాలు చేస్తారని ప్రశ్నించారు. మంత్రి సీతక్క, కలెక్టర్ సమక్షంలోనే ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగినా అధికా రులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు.
అదివాసి మహిళా మంత్రి అయిన సీతక్క మరో అదివాసి మహిళా ఎమ్మెల్యేనైన తనను అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. నైతిక విలు వలు పాటించకుండా రాజకీయాల్లో ఉండ డం సిగ్గుచేటు అని మండిపడ్డారు. అనంతరం ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికా రులపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు అరుణ, దుర్పదాబాయి, అజయ్‌కుమార్, ఎంపీపీ సౌంద ర్య, మోతీరాం, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్‌హైమద్, పెంటు, గ్రంథాలయ సంస్థ మా జీ చైర్మన్ కనకయాదవరావు, నాయకులు సరస్వతి, అబ్దుల్‌కలాం, ఇంతియాజ్‌లాలా, అనిల్, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.