136 ట్రాక్టర్లు ఇసుక డంపు సీజ్
పోతంగల్ వాగులో నిలువ ఉంచిన ఇసుకను సీజ్ చేసిన అధికారులు...
కామారెడ్డి (విజయక్రాంతి): మంజీరాలో ఇసుక వేట విజయక్రాంతిలో శుక్రవారం వచ్చిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. అక్రమ ఇసుక దందాను కొనసాగిస్తున్న ఇసుక మాఫియా తీరుపై వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. 136 ట్రాక్టర్ల ఇసుక డంపును పోతంగల్ తాహాసిల్దార్ సురేందర్ నాయక్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు నేతృత్వంలో శుక్రవారం ఆకస్మికంగా ఇసుక డంపుల నిలవలపై అధికారులు దాడులు నిర్వహించారు. 136 ట్రాక్టర్ల ఇసుక డంపును అధికారులు సీజ్ చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడిల మేరకే స్థానిక అధికారులు దాడులు నిర్వహించి ఇసుకను పెద్ద మొత్తంలో సీజ్ చేశారు. కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో మంజీరా నది ప్రవహిస్తుంది. నదికి ఇరువైపులా ఉన్న గ్రామాల నుంచి ఇసుకను అక్రమార్కులు తరలిస్తున్నారు. ఇసుక మాఫియాలు నిత్యం తీసుకొని కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారు. అధికార అండదండలతో రాజకీయ పలుకుబడితో ఆర్థిక బలంతో కొంతమంది వ్యక్తులు ఇసుక దందానే వారి వృత్తిగా మార్చుకొని ఇసుక మాఫియా నడిపిస్తున్నారు.
అధికారులను మేనేజ్ చేస్తూ అంతా చూసుకుంటామంటూ ఇసుక మాఫియాదారులు బహిరంగంగా నిత్యం వందలాది ట్రాక్టర్ల లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తూ అమ్ముకుంటున్నారు. అనుమతులు లేవు వే బిల్లులు లేవు అడ్డదారుల్లో అక్రమంగా ఇసుకను మంజీరా నది నుంచి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో అధికారులు కూడా కిమ్మనడం లేదు. దీంతో ఇసుక మాఫియా ఆగడాలు వారు ఆడింది ఆట పాడింది పాటగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. పట్టుబడిన వెయ్యి రూపాయల నుంచి పదివేల వరకే అధికారులు జరిమానాలు విధించడంతో టిప్పర్ బయట మార్కెట్లో 50వేల రూపాయలు పలుకుతుండగా ఆదికారులు కేవలం 10000 మాత్రమే జరిమానా విధిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక బయట మార్కెట్లో 8000 వేల వరకు పలుకుతుండగా కేవలం 1000 రూపాయల జరిమానా విధించి అధికారులు వదిలి పెడుతున్నారు. దీంతో కేసులైనా కూడా ఇసుక మాఫియా భయపడడం లేదు. ప్రభుత్వా అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక దాన చేస్తే ఉపేక్షించే లేదని ఇంచార్జి తల్లి తాహసిల్దార్ సురేందర్ నాయక్ ఇసుక మాఫియాను హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలకు వేలన్ వేసి అందజేస్తామని తాహసిల్దార్ సురేందర్ నాయక్ వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇసుక డంపులను సీజ్ చేసినట్లు సమాచారం.