05-03-2025 06:58:51 PM
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబాత్పూర్ అంతర్ రాష్ట్ర సరిహద్దు వద్ద జాతీయ రహదారి 161పై రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బుధవారం ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. బిచ్కుంద సీఐ జగడం నరేష్, మద్నూర్ ఎస్సై విజయ్ కొండ, తహశీల్దార్ ముజీబ్, ఆర్టీవో, పోలీసు శాఖ అధికారులు పరిశీలించారు. వారు మాట్లాడుతూ... రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని వాహనదారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారిపై ఇకపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.