calender_icon.png 13 January, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణాలకు అధికారుల వత్తాసు!

07-12-2024 12:57:59 AM

  1. కార్వాన్ సర్కిల్ పరిధిలో టౌన్‌ప్లానింగ్ అధికారుల ఇష్టారాజ్యం

డబ్బులిస్తే ఎలాంటి నిర్మాణానికైనా ఓకే

ఆదాయం కోల్పోతున్న ప్రభుత్వం

కార్వాన్, డిసెంబర్ 6: కార్వాన్ సర్కిల్ పరిధిలోని కార్వాన్ సర్కిల్ పరిధిలోని కార్వాన్, లంగర్‌హౌస్, గోల్కొండ, టోలీచౌకి తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తునాయి. నిర్మాణదారులకు టౌన్‌ప్లానింగ్ అధికారులు పూర్తిస్థా యిలో సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి చాలా ప్రాంతాల్లో జీ ప్లస్ 1 లేదా 2 పర్మిషన్ తీసుకుంటున్న నిర్మాణదారులు నిబంధనలకు విరుద్ధంగా జీ ప్లస్ ఫోర్, 5 అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు.

టౌన్ ప్లానింగ్ అధికారులు ఈవిషయం తెలిసినా నిర్మాణదారులతో కుమ్మక్కై ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా వారుకూడా అందిన కాడికి డబ్బులు దండుకొని నిమ్మకుంటున్నారనే విమర్శలున్నాయి. 

పట్టించుకునే నాథుడు కరువు..

అనుమతులకు మించి చేపడుతున్న నిర్మాణదారుల నుంచి వసూళ్ల విషయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో సిబ్బందిని నియమిం చుకొని నిర్మాణదారుల నుంచి అందినకాడికి వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. లంగర్‌హౌస్ డివిజన్ పరిధిలోని వన్‌మోర్ నగర్‌లో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున్న కొనసాగుతున్నా అడిగే నాథుడు లేకుండాపోయారు.

కార్వాన్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ విభాగపు ఏసీపీ పావనితోపాటు సెక్షన్ అధికారి ప్రకాష్‌ను వివరణ కోరేందుకు పలుమార్లు ఫోన్‌లో ప్రయత్నించగా వారి నుంచి స్పందన రాలేదు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.