కర్ణాటకకు విద్యాశాఖ బృందం
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): పాఠశాల విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకు బెంగళూరులో పర్యటించనుంది. బుధవారం సాయంత్రం విద్యాశాఖ అధికారుల బృందం బయలుదేరి వెళ్లనుంది.
గురువారం అక్కడి స్కూళ్లను సందర్శించనుంది. సర్కారు బడుల్లో ఏఐ ఆధారిత పాఠాలను పూర్తిస్థాయిలో బోధించాలని విద్యాశాఖ యోచిస్తోం ది. ముఖ్యంగా 1--5 తరగతుల్లోని విద్యార్థులకు ఏఐ ఆధారంగా పాఠాలు చెప్పాలని యోచిస్తున్నది. ఈ విధానాన్ని అధ్యయనం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ఈ మేరకు రాష్ర్ట బృందం గురువారం కర్ణాటకలో అధ్యయనం చేయనుంది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సహా ఎస్సీఈఆర్టీ నిపుణుల బృందం అధ్యయనం చేయనుంది.